కోర్టులో కేసు ఉన్న వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం..?
ఇప్పటికైనా అధికారులు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి.
వీఆర్ఏ పోతగాని కనుకయ్య.

డోర్నకల్/మరిపెడ(జులై 22)నమస్తే న్యూస్.
2020 కరోనా సమయంలో జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తికి ఉద్యోగం ఎలా వచ్చిందని స్థానిక వీఆర్ఏ ఆరోపిస్తున్నారు.?ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని, ఓ గ్రామ పంచాయితీ పరిధిలోని నిందితులపై కేసు నమోదు జరిగిందని అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని కనకయ్య ఆరోపించారు.ఈ నేపథ్యంలో కేసు వివరాలను పరిగణనలోకి తీసుకొని ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి,నిజానిజాలు నిగ్గు తేల్చాలని పోతగాని కనుకయ్య కోరుతున్నారు.ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల వివరణ కోసం ప్రయత్నించగా,ఇంకా అందుబాటులోకి రాలేదు.
