Type Here to Get Search Results !

51 శాతం ఫిట్మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలి-'తపస్' డిమాండ్

NAMASTHE NEWS 0

51 శాతం ఫిట్మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలి-'తపస్' డిమాండ్


ఆగష్టు 1 మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ.



తొర్రూర్, జూలై 20 (నమస్తే న్యూస్): 

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) మూడు అంచెల ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఆగస్టు 1న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న మహా ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను తొర్రూర్ డివిజన్ కేంద్రంలో సోమవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్షుడు జంజిరాల నాగరాజు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 51 శాతం ఫిట్మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు. అలాగే 2003 డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టైం స్కేల్ అమలు చేయాలని, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు 010 కింద వేతనాలు చెల్లించాలని, అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, 2008 డీఎస్సీ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకమైన ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎనగాండ్ల నాగిరెడ్డి, జీవిలికపల్లి నరహరి, జిల్లా కార్యదర్శి పులిగుజ్జ యాకయ్య, తొర్రూర్ మండల బాధ్యులు మేరుగు రమేష్, ఆకోజు అరుణ్,నెల్లికుదురు మండల ప్రధాన కార్యదర్శి చెన్నోజు కళ్యాణ్, పెద్దవంగర మండల ప్రధాన కార్యదర్శి కోడూరు మధుసూదన్ రెడ్డి, దంతాలపల్లి మండల గౌరవ అధ్యక్షుడు తెమడ హరిబాబు, వనం నరసింహులు, కుశాని రవీందర్, న్యారం పరంధామ, చిలకని భాస్కర్, పెట్లోజు సోమేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System