Type Here to Get Search Results !

కార్మికులకు అండగా "ఎర్రజెండా":జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య.

NAMASTHE NEWS 0

  • తానంచర్లలో సీపీఐ(ఎం)లోకి చేరికలు.  
  • కార్మికులకు ఎర్రజెండా అండగా ఉంటుంది.
  • జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య.


సమావేశంలో మాట్లాడుతున్నజిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య.



డోర్నకల్/మరిపెడ(జూన్ 08)నమస్తే న్యూస్.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తనంచర్ల మేజర్ గ్రామ పంచాయతీలో కామ్రేడ్ సీత వెంకన్న అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కా.అల్వాల వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్మిక,కర్షక,కష్టజీవులకు అండగా సీపీఐ(ఎం)ఎర్రజెండా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వీరయ్య అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ గ్రామస్థాయిలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక్క నెలలోనే పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలను నాలుగు సార్లు పెంచిందని,పేదలు నిత్యవసర వస్తువులు కొని తినలేని పరిస్థితుల్లో జీవిస్తున్నారని అన్నారు.ఈ సందర్భంగా తనంచర్ల గ్రామ పంచాయతీలో సభ నిర్వహించి కొత్తగా కొంతమందిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు.పార్టీలో చేరిన వారిలో సీత వెంకన్న,పోలేపాక గణేష్,పగిళ్ల సత్యం,పోలేపాక ప్రవళిక,సీత నాగేశ్వరరావు,పోలేపాక ప్రభాస్,పోలేపాక వీరన్న,ప్రవీణ్ మరియు కొమ్ము మహేష్ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్,మండల ఆర్గనైజర్ బాణాల రాజన్న,మండల కమిటీ సభ్యులు బోడపట్ల రాజశేఖర్,వ్య.కా.సం.మండల అధ్యక్షులు ఎండీ ఇమామ్ సాబ్,రైతు సంఘం మండల నాయకులు నలబోలు లక్ష్మారెడ్డి,అల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System