Type Here to Get Search Results !

మహిళల ఆర్థిక,సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి:ఎమ్మెల్యే వేముల వీరేశం

NAMASTHE NEWS 0

మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి.

గ్రామీణ మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలవాలి.

-ఎమ్మెల్యే వేముల వీరేశం.


   మహిళా సమాఖ్య భవనానికి  శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే.


నకిరేకల్,జూన్ 29(నమస్తే న్యూస్ డెస్క్)

నకిరేకల్ నియోజకవర్గంలోని తాటికల్ గ్రామంలో మహిళా సమాఖ్య సంఘం కోసం నూతనంగా నిర్మించనున్న భవనానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి, స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళా సాధికారతే గ్రామాభివృద్ధికి బలమైన పునాదిగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System