Type Here to Get Search Results !

బొజ్జన్నపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఏర్పాటు.

NAMASTHE NEWS 0

బొజ్జన్నపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఏర్పాటు.



నర్సింహులపేట, జూన్ 3 (నమస్తే న్యూస్):మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని బొజ్జన్నపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని బుధవారం ఏర్పాటు చేశారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాగవెల్లి ముఖేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ గ్రామ నూతన కార్యవర్గంతో పాటు వివిధ అనుబంధ విభాగాల కమిటీలను కూడా పూర్తిస్థాయిలో నియమించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనుకల రమేష్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు భానోత్ దస్రు నాయక్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ మహబూబ్ ఖాన్, సమన్వయ కమిటీ అధ్యక్షుడు అల్వాల శ్రీనివాస్, సోషల్ మీడియా అధ్యక్షుడు సతీష్ గౌడ్, వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ కాసాయాకయ్య, బొజ్జన్నపేట సర్పంచ్, మాజీ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు గాడిపల్లి శ్రీనివాస్, మార్క రమేష్, కళ్యాణ్, శ్రీను, రాజు, మెరుగు నరేష్ గౌడ్, పాపా నాయక్ తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నూతన కమిటీ కృషి చేయాలని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన గ్రామ అధ్యక్షుడు నాగవెల్లి ముఖేష్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System