Type Here to Get Search Results !

మంగోరుగూడెంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్.. భారీగా అక్రమ నల్ల బెల్లం పానకం స్వాధీనం.

NAMASTHE NEWS 0

మంగోరుగూడెంలో పోలీసుల కార్డన్ సెర్చ్

భారీగా అక్రమ నల్ల బెల్లం పానకం స్వాధీనం.




చిన్నగూడూరు,జూన్29(నమస్తే న్యూస్):మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంగురుగూడెం గ్రామంలో పోలీసులు నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో గుడుంబా తయారీకి వినియోగించే భారీ మొత్తంలో నిషేధిత అక్రమ నల్ల బెల్లం పానకం బయటపడింది. స్వాధీనం చేసుకున్న పానకాన్ని పోలీసులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఈ చర్యతో గ్రామంలో అక్రమ గుడుంబా తయారీ కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.పోలీసుల ఈ దాడిలో బయటపడిన నల్ల బెల్లం పానకం పరిమాణం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఒక్క మంగురుగూడెం గ్రామంలోనే ఇంత భారీ మొత్తంలో నిల్వలు లభించడం తో మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా ఇలాంటి అక్రమ నిల్వలు, తయారీ కేంద్రాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.అక్రమ గుడుంబా తయారీ సమాజ ఆరోగ్యానికి, శాంతిభద్రతలకు ముప్పుగా మారే అవకాశం ఉన్నందున, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే గుడుంబా తయారీకి ఉపయోగించే నిషేధిత నల్ల బెల్లం అక్రమ రవాణా, నిల్వలు, సరఫరా గొలుసును పూర్తిగా వెలికితీసి అరికట్టాలని ప్రజలు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System