Type Here to Get Search Results !

మరిపెడ కార్గిల్ సెంటర్‌లో డ్రైనేజీ పూడికతీత పనులు పరిశీలన.

NAMASTHE NEWS 0

  • మరిపెడ కార్గిల్ సెంటర్‌లో డ్రైనేజీ పూడికతీత పనులు పరిశీలన.
  • కమిషనర్‌తో కలిసి మున్సిపల్ ఛైర్‌పర్సన్ తనిఖీ.



 డోర్నకల్/మరిపెడ(జూన్ 09)నమస్తే న్యూస్.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని కార్గిల్ సెంటర్‌లో ప్రధాన మురుగు కాల్వలో చేపట్టిన పూడికతీత పనులను మంగళవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డితో కలిసి పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున డ్రైనేజీలో పూడిక తొలగించి నీటి ప్రవాహానికి అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.మురుగునీరు రోడ్లపైకి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని,పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు.పట్టణ పరిశుభ్రత,ప్రజారోగ్యం దృష్ట్యా డ్రైనేజీ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని అన్నారు.వారితో పాటు కౌన్సిలర్లు మెరుగు రాము,పానుగోతు రాములు,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అలువాల ఉపేందర్ ప్రజాపతి,గంధసిరి భిక్షపతి,లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System