Type Here to Get Search Results !

పోలియో రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు తల్లితండ్రులు సహకరించాలి:సర్పంచ్ మాలోత్ బాలు నాయక్.

NAMASTHE NEWS 0

  • పోలియో రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్క తల్లిదండ్రి సహకరించాలి.
  • సర్పంచ్ మాలోత్ బాలు నాయక్.
  • పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ మాలోత్ బాలు నాయక్.
  • ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి.

చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న సర్పంచ్ బాలు నాయక్

నర్సింహులపేట, జూన్ 28 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల గ్రామపంచాయతీలో ఆదివారం పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మాలోత్ బాలు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.అనంతరం సర్పంచ్ మాలోత్ బాలు నాయక్ మాట్లాడుతూ, పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో చుక్కలు చిన్నారులకు జీవితాంతం రక్షణ కవచంలా నిలుస్తాయని, ఆరోగ్యవంతమైన జీవితానికి, బంగారు భవిష్యత్తుకు అవి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.వంతడుపుల గ్రామాన్ని పోలియో రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఏ చిన్నారి కూడా పోలియో చుక్కలకు దూరం కాకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System