Type Here to Get Search Results !

ఆలయ నిర్మాణానికి మాజీ మంత్రి ఆర్థిక సహాయం.

NAMASTHE NEWS 0

నీలికుర్తిలో మల్లికార్జున స్వామి దేవాలయ నిర్మాణం.
విరాళం అందించిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్.



డోర్నకల్/మరిపెడ(జూన్ 12)నమస్తే న్యూస్.

ఆధ్యాత్మికతతోనే ప్రజల్లో క్రమశిక్షణ,శాంతి, ఐక్యత అలవడుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండలంలోని నీలికుర్తి గ్రామంలో నిర్మాణంలో ఉన్న పవిత్ర,ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం నిర్మాణ పనుల కోసం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రూ.25,000/- విరాళాన్ని అందజేశారు.ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణం త్వరితగతిన పూర్తై భక్తులకు సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నీలికుర్తి మాజీ సర్పంచ్ తొట్టి శ్రీను,తొట్టి సత్యం,రాసాల కొమురయ్య,లక్షాధి,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System