Type Here to Get Search Results !

రిటైర్డ్ ఉద్యోగిని పరామర్శించిన యూటీఎఫ్ నాయకులు.

NAMASTHE NEWS 0

రిటైర్డ్ ఉద్యోగిని పరామర్శించిన యూటీఎఫ్ నాయకులు.



రిపోర్టర్:కారంపురి వెంకటేశ్వర్లు నేత.7893556455.

డోర్నకల్/మరిపెడ(జూన్ 30)నమస్తే న్యూస్.తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎం.డి.అబ్దుల్ ఖాదర్‌ను టీఎస్ యూటీఎఫ్ జిల్లా,మండల నాయకులు మంగళవారం ఆయన నివాసంలో పరామర్శించారు.టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు ఎం.డి.అబ్దుల్ అజీజ్,సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి.అబ్దుల్ రషీద్ తండ్రి అయిన అబ్దుల్ ఖాదర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు నాయకులు ధైర్యం చెబుతూ తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.ఈ పరామర్శ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా నాయకులు ఎం.శివప్రసాద్,తుమ్మ వెంకటప్పయ్య,అమీన్,సత్యనారాయణ,రాములు,కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System