Type Here to Get Search Results !

గంజాయి నిర్మూలనకు ప్రజలు సహకరించాలి:నర్సింహులపేట ఎస్సై భానోత్ వెంకన్న

NAMASTHE NEWS 0

  • గంజాయి రహిత మండలమే లక్ష్యం: నర్సింహులపేట పోలీసులు.
  • గంజాయి నిర్మూలనకు ప్రజల సహకారం తప్పనిసరి నర్సింహులపేట ఎస్సై భానోత్ వెంకన్న 

డోర్ స్టిక్కర్లను స్వయంగా అంటిస్తున్న ఎస్సై బానోతు వెంకన్న

నర్సింహులపేట, జూన్ 16 (నమస్తే న్యూస్):

గంజాయి రహిత మండలంగా నర్సింహులపేటను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.ఈ క్రమంలో మంగళవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిధిలోని పలు ప్రధాన ప్రాంతాల్లో గంజాయి వ్యతిరేక సమాచార పోస్టర్లు, బోర్డులను సోమవారం ప్రదర్శించారు.మండల కేంద్రంలోని ఆటో స్టాండ్, పెట్రోల్ బంక్, టీ స్టాళ్ల వద్ద ప్రజలకు అవగాహన కల్పించే విధంగా గంజాయికి సంబంధించిన సమాచార పోస్టర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఎస్‌బీఐ బ్యాంక్, ఏటీఎం సెంటర్, మీసేవ కేంద్రాల వద్ద ప్రజలకు స్పష్టంగా కనిపించేలా గంజాయి వ్యతిరేక సమాచార బోర్డులను ప్రదర్శించారు.విద్యార్థుల్లో మత్తు పదార్థాల పట్ల అవగాహన పెంపొందించేందుకు జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్, ఎమ్మార్వో కార్యాలయ ప్రాంగణాల్లో నర్సింహులపేట ఎస్సై బి. వెంకన్న స్వయంగా పోలీసు సిబ్బందితో కలిసి పోస్టర్లను అతికించారు.ఈ సందర్భంగా ఎస్సై బానోతు వెంకన్న మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి వినియోగం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా మండలంలోని ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నామని, ప్రజల సహకారంతో నర్సింహులపేటను గంజాయి రహిత మండలంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System