Type Here to Get Search Results !

ఓటీపీతోనే యూరియా పంపిణీ.. రైతులకు సరికొత్త విధానం.

NAMASTHE NEWS 0

ఓటీపీతోనే యూరియా పంపిణీ.. రైతులకు సరికొత్త విధానం.





నర్సింహులపేట, జూన్ 16 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో వర్షాకాల పంటల సాగు నేపథ్యంలో రైతులకు యూరియా ఎరువుల పంపిణీని ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. రైతులు తమ మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) ఆధారంగానే యూరియాను పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.రైతులు ముందుగా ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా కోసం బుకింగ్ చేసుకోవాలి. అనంతరం సంబంధిత రైతుల వివరాలు నమోదు కావడంతో వారి మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపబడుతుంది. ఆ ఓటీపీని చూపించిన తర్వాత మాత్రమే యూరియా ఎరువులను పంపిణీ చేస్తున్నారు.నర్సింహులపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కార్యాలయంతో పాటు ఆగ్రోస్ రైతు సేవా సమితి కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ కొనసాగుతోంది. ఈ విధానం ద్వారా ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు అర్హులైన రైతులకు ఎలాంటి అవకతవకలు లేకుండా ఎరువులు అందే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.వర్షాకాల సాగు పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో రైతులు ముందస్తుగా ఫర్టిలైజర్ యాప్‌లో నమోదు చేసుకుని, తమ మొబైల్ నంబర్ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. యూరియా అవసరమున్న రైతులు నిర్ణీత కేంద్రాలను సంప్రదించి ఎరువులు పొందాలని అధికారులు తెలిపారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System