Type Here to Get Search Results !

ఈవీఎంల గోదామును తనిఖీచేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

NAMASTHE NEWS 0

ఈవీఎంల గోదామును తనిఖీచేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.



మహాబాబాబాద్ జూన్ 6,(నమస్తే న్యూస్):కురవి రోడ్ కలెక్టరేట్ దగ్గరలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు (ఈవీఎంలు), వివిప్యాట్‌లు భద్రపరిచిన గోదామును జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ శనివారం గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు.భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఈ పరిశీలన చేపట్టారు. గోదాములో పటిష్ట భద్రత నడుమ భద్రపరిచిన ఈవీఎంలు, వివిప్యాట్‌లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రి నిల్వ ఉంచిన గదులను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.భద్రతా చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, గోదాం భద్రతా వ్యవస్థలను సమీక్షించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించి సంతకాలు చేశారు.ఈ తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ పవన్ కుమార్,    గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System