Type Here to Get Search Results !

మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయంపై ప్రత్యేక తనిఖీలు

NAMASTHE NEWS 0

  • మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయంపై ప్రత్యేక తనిఖీలు.
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.




కురవి,జూన్ 11(నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్  ఆదేశాల మేరకు, కురవి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని అరికట్టేందుకు ప్రత్యేక డికాయ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా సీఐ రూరల్ ఆధ్వర్యంలో, ఎస్ఐ కురవి మరియు సిబ్బందితో కలిసి కురవి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా 2 పాన్ షాపులు, 6 టీ స్టాళ్లు, 21 కిరాణా దుకాణాలను పరిశీలించారు.తనిఖీల సందర్భంగా మైనర్లకు సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సంబంధిత దుకాణ యజమానులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి చర్యలు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వివరించారు.అదేవిధంగా, భవిష్యత్తులో మైనర్లకు సిగరెట్లు, గుట్కా, పొగాకు ఉత్పత్తులు విక్రయించినట్లు గుర్తిస్తే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణ యజమానులకు హెచ్చరించారు.పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని పూర్తిగా నిరోధించేందుకు ప్రజలు సహకరించాలని పోలీసు అధికారులు కోరారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System