Type Here to Get Search Results !

మరిపెడ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ ప్రవేశాలు ప్రారంభం.

NAMASTHE NEWS 0

మరిపెడ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ ప్రవేశాలు ప్రారంభం.




డోర్నకల్/మరిపెడ(జూన్ 29)నమస్తే న్యూస్.స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రవేశాలు ప్రారంభమైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు,కోఆర్డినేటర్ అనంతరావు తెలిపారు.ప్రవేశ వివరాలు ఈ సందర్భంగా అనంతరావు,సహాయ కోఆర్డినేటర్ జనార్ధన చారి మాట్లాడుతూ,బడి మధ్యలో చదువు మానివేసిన విద్యార్థులు,ఇతర కారణాల వల్ల చదువుకోలేకపోయిన వారు ఓపెన్ స్కూల్ ద్వారా ప్రవేశాలు పొంది ఉన్నత చదువులు కొనసాగించవచ్చని అన్నారు.కావలసిన పత్రాలు:ప్రవేశం కోరుకునే అర్హత కలిగిన విద్యార్థులు ఆధార్ కార్డు,పుట్టిన తేదీ ధృవపత్రంతో పాఠశాల కార్యాలయంలో సంప్రదించి ప్రవేశం పొందవచ్చు.పూర్తి వివరాలకు 7729967711 నంబరులో సంప్రదించాలని కోరారు.ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జులై 28 వరకు ప్రవేశాలు స్వీకరిస్తామని వారు స్పష్టం చేశారు.చదువు ఆగిపోయిన వారికి ఇది మంచి అవకాశమని,సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System