Type Here to Get Search Results !

పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలి.

NAMASTHE NEWS 0

  • పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలి.
  • వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వీరయ్య డిమాండ్.

సమావేశంలో మాట్లాడుతున్న  జిల్లా కార్యదర్శి వీరయ్య


డోర్నకల్/మరిపెడ జూన్ 11(నమస్తే న్యూస్):

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పెరిగిన ధరలకు అనుగుణంగా రెక్కల కష్టంపై ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కార్మికులకు కూలి రేట్లు పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్వాల వీరయ్య డిమాండ్ చేశారు.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికుల గ్రామ విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు.ఈ సమావేశానికి సంఘం మండల కార్యదర్శి బాణాల రాజన్న,గుండ గాని మధుసూదన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వీరయ్య కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ,కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్,డీజిల్,గ్యాస్,నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని,దీంతో వ్యవసాయ కార్మికులు కొని తినలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కూలీల సమస్యలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.పాలకులు ఇచ్చిన హామీలైన భూమి లేని వ్యవసాయ కార్మికులకు ప్రతి ఏటా రూ.12 వేలు,మహిళలకు రూ.2,500,జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 150 రోజుల పనిదినాలు,రోజు కూలి రూ.400కి పెంపు,పట్టణ ప్రాంతాల్లో పనులు కల్పించడం,అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు,రేకుల ఇళ్లలో జీవనం గడుపుతున్న వ్యవసాయ కార్మికులకు స్లాబు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు,అర్హులైన వారందరికీ పెన్షన్లు,పెన్షన్ల పెంపు తదితర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సంఘం మండల కార్యదర్శి బాణాల రాజన్న,మండల నాయకులు గుండ గాని మధుసూదన్,గ్రామ నాయకులు తాడూరి వీరేంకులు,వ్యవసాయ కూలీల గుంపు మేస్త్రీలు బత్యం వీరన్న,బత్యం స్వరూప,గాడి పెళ్లి ఉపేంద్ర,దుండి నరసమ్మ,షేక్ సైదులు,షేక్ జానీ,వంగూరు ఎలేంద్ర,ఆలేటి భారతమ్మ, ఉర్లుగొండ పద్మ,కండి రజిత,దుండి ముత్తి లింగమ్మ,అయినాల ఎల్లమ్మతో పాటు పలువురు కూలీలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System