Type Here to Get Search Results !

ఇద్దరు స్నేహితురాళ్లు అనుమానాస్పద మృతి...భూక్యా తండాలో విషాదం.

NAMASTHE NEWS 0

  • మరిపెడ మండలం భూక్యాతండాలో విషాదం. 
  • మద్యం సేవించిన ఇద్దరు స్నేహితురాళ్లు అనుమానాస్పద మృతి.
  • కల్తీ మద్యం అనుమానంతో పోలీసుల దర్యాప్తు.
  • పోస్టుమార్టం కోసం మృతదేహాల తరలింపు.


ఫైల్ ఫోటోలు 

డోర్నకల్/మరిపెడ,జూన్ 03(నమస్తే న్యూస్):మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యా తండాలో ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.మృతులు మాలోత్ శారద,మాలోత్ నీలాగా గుర్తించారు.ఇద్దరికీ 40,39 ఏళ్ల వయసు ఉండగా,వారు స్నేహితులు కావడం గమనార్హం.సూర్యాపేట నుంచి తిరిగి వస్తున్న క్రమంలో మద్యం కొనుగోలు చేసిన వీరు,శారద ఇంట్లో కలిసి మద్యం సేవించారు.ఆ తర్వాత ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు.గమనించిన స్థానికులు వెంటనే వారిని మరిపెడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా,అప్పటికే ఇద్దరూ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

మద్యంలో విషం కలిసిందా లేక కల్తీ మద్యం కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.ఒక్కసారిగా ఇద్దరు స్నేహితురాళ్లు మృతి చెందడంతో తండాలో విషాదం నెలకొంది.ఈ ఘటనపై పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తెలియచేస్థామని పోలీసులు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System