Type Here to Get Search Results !

కందాళ స్ఫూర్తితో సర్పంచి చేయూత: మృతుడి కుటుంబానికి 50 కేజీల బియ్యం పంపిణీ.

NAMASTHE NEWS 0

కందాళ స్ఫూర్తితో సర్పంచి చేయూత: మృతుడి కుటుంబానికి 50 కేజీల బియ్యం పంపిణీ.



తిరుమలాయపాలెం,జూన్24(నమస్తేన్యూస్)పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి స్ఫూర్తితో, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం హస్నాబాద్‌ లో కొనసాగుతోంది. హస్నాబాద్ గ్రామానికి చెందిన మిట్టకోల వెంకన్న ఇటీవల మృతి చెందారు. ఆయన దశదిన కర్మల సందర్భంగా, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆదేశాల మేరకు హస్నాబాద్ గ్రామ సర్పంచ్  కొవ్వూరు పద్మ - సత్తిరెడ్డి దంపతులు స్పందించారు. మంగళవారం సాయంత్రం వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచి పద్మ-సత్తిరెడ్డి ఆధ్వర్యంలో, మృతుడి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేశారు. కందాళ ఉపేందర్ రెడ్డి చూపిన బాటలో నడుస్తూ, పేద కుటుంబాలకు అండ గా ఉండటమే తమ లక్ష్యమని సర్పంచి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ గ్రామ వార్డు సభ్యులు మాగి వెంకన్న, మోటపోతుల శ్రీను, పార్టీ గ్రామ కార్యదర్శి పల్లి వినోద్, నాయకులు కొవ్వూరు సందీప్ రెడ్డి, పల్లి భాస్కర్, మాగి లక్ష్మయ్య, పల్లి వెంకన్న, పల్లి అశోక్, మాగి వెంకటేష్, రాచకొండ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System