Type Here to Get Search Results !

నిస్సహాయుల ఆత్మబంధువు ననావత్ భూపాల్ నాయక్ పై 'నమస్తే న్యూస్'ప్రత్యేక కథనం.

NAMASTHE NEWS 0

నిరుపేద రైతు కుటుంబం నుండి కిసాన్ పరివార్‌ను నిలబెట్టిన భూపాల్ నాయక్.

లక్షలాది రైతులకు దిక్సూచిగా మారిన భూపాల్ నాయక్.

రైతు సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయం,ఫైనాన్స్‌లో వినూత్న మార్గం.

నిస్సహాయుల ఆత్మబంధువు ననావత్ భూపాల్ నాయక్ పై 'నమస్తే న్యూస్'ప్రత్యేక కథనం.




మరిపెడ, మే 27 (నమస్తే న్యూస్)

ఎక్కడ మొదలుపెట్టాం అనేది కాదు,ఎంత దూరం వెళ్లాలనుకుంటున్నాం అనేదే ముఖ్యం” – ఈ మాటను నిజ జీవితంలో నిరూపించుకున్న మహోన్నతమైన వ్యక్తి ననావత్ భూపాల్ నాయక్.

ఒకప్పుడు పెట్రోల్ పంప్ అటెండెంట్‌గా పనిచేసిన భూపాల్ నాయక్,ఈరోజు కిసాన్ పరివార్ వ్యవస్థాపకుడిగా,షేర్స్ బజార్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వందల మందికి ఉద్యోగ అవకాశాలు కలిపిస్తూ,వేలాది మంది రైతులకు,పెట్టుబడిదారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.


కష్టమే మెట్టుగా మార్చుకున్న ప్రయాణం

పెట్రోల్ పంప్‌లో చేసిన పని ఆయనకు క్రమశిక్షణ,ఓపిక,మనుషులతో మాట్లాడే నైపుణ్యాన్ని నేర్పింది.అదే అనుభవంతో ఆయన వెనుదిరిగి చూడకుండా కష్టాన్ని ఇష్టంగా చేసుకొని,ఆయన వ్యాపార,సామాజిక నాయకత్వానికి పునాది అయింది.వ్యవసాయ రంగంలో ఉన్న లోటుపాట్లను దగ్గరగా చూసిన ఆయన,రైతును ఆర్థికంగా బలపరిచే లక్ష్యంతో 2016లో కిసాన్ పరివార్‌ను స్థాపించారు.


కిసాన్ పరివార్: వ్యవసాయానికి కొత్త దిశ

సుస్థిర వ్యవసాయం,ఆర్గానిక్ ఫార్మింగ్,టెక్నాలజీ అనుసంధానాన్ని ప్రధానంగా తీసుకున్న కిసాన్ పరివార్ నేడు 700 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని నిర్వహిస్తోంది.25,000 మందికి పైగా రైతులకు శిక్షణ,మార్కెట్ అనుసంధానం,సాంకేతిక సహాయం అందిస్తూ సర్టిఫైడ్ ఆర్గానిక్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో ₹304 కోట్ల ఆదాయం సాధించిన సంస్థ,2024-25లో ₹977 కోట్లకు చేరుకుంటుందని అంచనా.ఆహార ప్రాసెసింగ్,రిటైల్,ఎనర్జీ,లాజిస్టిక్స్ వంటి అనుబంధ రంగాల్లోనూ విస్తరించి సామాజిక ప్రభావంతో కూడిన వ్యాపార నమూనాను నిర్మించింది.


సామాజిక సేవలోను  ప్రత్యేక ముద్ర.

అందరూ సంపాదిస్తారు కనీ సమాజ సేవా కొందరు మాత్రమే చేస్తారు.డోర్నకల్ నియోజక వర్గంలో పేదవారికి గుర్తించి వారికి కిసాన్ పరివార్ సంస్థ తరుపున సహాయ సహాకారాలు అందించారు.అలాగే వరద బాధితులకు,పేద విద్యార్థులకు,నూతన ఆలయాల నిర్మాణాలకు సహాకారం అందించారు.


షేర్స్ బజార్ ద్వారా ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో అడుగు

వ్యవసాయంతో పాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలోనూ భూపాల్ నాయక్ తన ముద్ర వేశారు.షేర్స్ బజార్ ఫౌండర్ & MDగా ఆయన వ్యవసాయం,టెక్నాలజీ,రియల్ ఎస్టేట్,పబ్లిక్ సర్వీస్ వరకు తన కార్యకలాపాలను విస్తరించారు.వ్యవస్థలోని సమస్యలను రూట్ కాజ్ అనాలసిస్,ప్రాసెస్ ఆటోమేషన్ ద్వారా పరిష్కరించి వ్యయ సామర్థ్యాన్ని పెంచడం ఆయన ప్రత్యేకత.


రాజకీయ ఎదుగుదలకు బలమైన పునాది

భూపాల్ నాయక్ కేవలం పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా,సామాజిక-వ్యవసాయ కార్యకర్తగా కూడా గుర్తింపు పొందారు.సప్లై చైన్ అస్థిరత,గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్ నిలుపుదల వంటి సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను సూచించడం ద్వారా ఆయన “ఆలోచనాపరుడైన నాయకుడు”గా పేరు తెచ్చుకున్నారు.“రైతుతో కలిసి ఉండటం,వృద్ధిని పెంపొందించడం,శ్రేయస్సును పండించడం”అనే నినాదంతో పనిచేస్తున్న ఆయన,భవిష్యత్తులో రాజకీయ రంగంలో కూడా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.


యువత పారిశ్రామిక ,వ్యాపార వేత్తలకు స్పూర్తిగా ''భూపాల్ నాయక్'

భూపాల్ నాయక్ ప్రయాణం చెప్పేది ఒక్కటే – కష్టం,స్పష్టత,నమ్మకం ఉంటే ఏ నేపథ్యం నుండి వచ్చినా పెద్ద లక్ష్యాలను సాధించవచ్చు.వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన రైతుకు గౌరవం తెచ్చిన భూపాల్ నాయక్  జీవిత కథలు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System