Type Here to Get Search Results !

పరిసరాల పరిశుభ్రత పై గ్రామ ప్రజలు అవగాహన కలిగి ఉండాలి:సర్పంచ్ పెదమాముల యాకయ్య.

NAMASTHE NEWS 0

నీరునిల్వ లేకుండా మురికి కాలువలు శుభ్రం..!
పరిసరాల పరిశుభ్రత పై గ్రామ ప్రజలు అవగాహన కలిగి ఉండాలి.
పేరుకుపోయిన వర్షపు నీరు జెసిపి సహాయంతో తొలగిస్తున్న సిబ్బంది.
పనులు పరిశీలించిన నర్సింహులపేట గ్రామ సర్పంచ్ పెదమాముల యాకయ్య, ఉపసర్పంచ్ కాస యాకయ్య.



నర్సింహులపేట,19 మే(నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా లోని నర్సింహులపేట మండలం కేంద్రంలో సర్పంచ్ పెద్దమాముల యాకయ్య, ఉప సర్పంచ్ కాస యాకయ్య ఆధ్వర్యంలో మన గ్రామం – మన అభివృద్ధి అనే సంకల్పంతో గ్రామ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఎంపీడీవో కార్యాలయం పక్కనుండి ఎస్సీ హాస్టల్, వడ్డెర బోర్డు మీదుగా కబరిస్థాన్ నుంచి గంగయ్య కుంట వరకు జేసీబీ సహాయంతో సేడ్రాన్ కాలువ వద్ద పేరుకుపోయిన మురుగు, చెత్తను తొలగించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొని పరిశుభ్రమైన గ్రామ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System