Type Here to Get Search Results !

మల్టీపర్పస్ వర్కర్స్ సేవలు మరువలేనివి:ఎంపీడీవో బి వేణుగోపాల్ రెడ్డి

NAMASTHE NEWS 0

మల్టీపర్పస్ వర్కర్స్ సేవలు మరువలేనివి.

ఎంపీడీవో బి వేణుగోపాల్ రెడ్డి 


మరిపెడ,మే 26(నమస్తే న్యూస్)

మహబూబాద్ జిల్లా మరిపెడ మండలంలో 48 గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్స్ సేవలు మరువలేవని,మీ కృషివల్లే గ్రామ పంచాయతీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయని,భవిష్యత్తులో కూడా ఇలాంటి అభివృద్ధి కోసం అందరూ ఐక్యమత్యంతో పని చేయాలని ఎంపీడీవో బి వేణుగోపాల్ రెడ్డి అన్నారు.మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో వివిధ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్స్,కారోబార్ ల నూతన కమిటీ సమావేశం జరిగింది.సమావేశానికి ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి,ఎంపీ ఓ దారావత్ సొమ్లానాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులను వారు ఘనంగా సన్మానించారు. 

ఎంపీడబ్ల్యూ ఓ నూతన కమిటీ ఎన్నిక.

-అధ్యక్షులుగా :అలవాల యాదగిరి 
-ప్రధాన కార్యదర్శిగా :ఆకారం వేణు 


మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం పంచాయతీ వర్కర్స్,కారోబార్ల యూనియన్ (సిఐటియు)అనుబంధం నూతన కమిటీ మంగళవారం ఎన్నుకున్నారు.మండల అధ్యక్షులుగా అలవాల యాదగిరి (అబ్బాయి పాలెం),ప్రధాన కార్యదర్శిగా ఆకారం వేణు(ఎడిజర్ల),ఉపాధ్యక్షులుగా ఆలేటీ హుస్సేన్ (ఎల్లంపేట),సహాయ కార్యదర్శిగా భూక్య బాలు (డి ఎస్ ఆర్ జండాల్ తండా),కోశాధికారిగా షేక్ యాకోబు ఆలీ (గుండెపుడి),ప్రచార కార్యదర్శిగా గంగుల మహేష్(చిల్లంచర్ల) గౌరవ సభ్యులుగా భూషిష్పాక చిరంజీవి (ఆనేపురం),వివిధ గ్రామాల నుండి  సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System