Type Here to Get Search Results !

గ్యాస్ డెలివరీకి మొబైల్ ఓ.టి. పి తప్పనిసరి

NAMASTHE NEWS 0

ఓటిపి చెబితేనే ఇకపై గ్యాస్ డెలివరీ....వినియోగదారులు సహకరించాలి.


నర్సింహులపేట, మే 05 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో నాగార్జున భారత్ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులకు కీలక సూచనలు జారీ చేసింది. మే 5 నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ డెలివరీ విధానంలో మార్పులు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. గ్యాస్ బుకింగ్ కోసం వినియోగదారుల మొబైల్ నెంబర్ కనెక్షన్‌కు లింక్ అయి ఉండటం తప్పనిసరి కాగా, డెలివరీ సమయంలో రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే OTPను డెలివరీ సిబ్బందికి ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. OTP లేకుండా సిలిండర్ అందించబోమని హెచ్చరించింది.అలాగే KYC వివరాలు అప్డేట్ చేయని వినియోగదారులు వెంటనే నవీకరించుకోవాలని సూచించింది. బుకింగ్ చేసిన తర్వాతే సిలిండర్ డెలివరీ జరుగుతుందని పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు ప్రధానంగా కమర్షియల్ సిలిండర్లకు వర్తిస్తాయని వెల్లడించింది. ఇదిలా ఉండగా, మే నెలలో గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని ఏజెన్సీ తెలిపింది. వినియోగదారులు తమ వివరాలు సకాలంలో అప్డేట్ చేసుకుని సేవలను వినియోగించుకోవాలని కోరింది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System