Type Here to Get Search Results !

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 2కే రన్ నిర్వహణ.

NAMASTHE NEWS 0

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 2కే రన్ నిర్వహణ.



నర్సింహులపేట,18 మే (నమస్తే న్యూస్):

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో 2కే రన్ నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి జయపురం క్రాస్ రోడ్డు వరకు జరిగిన ఈ పరుగు కార్యక్రమాన్ని తహసీల్దార్ రమేష్ బాబు, ఎంపీపీ కిన్నెర యాకయ్య, నర్సింహులపేట సర్పంచ్ పెదమాముల యాకయ్య, ఎస్సై భానోత్ వెంకన్న, ఆర్‌ఐ అఖిల్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం లక్ష్యమని తెలిపారు. యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతిరోజూ వ్యాయామం, క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. సమాజంలో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.పరుగులో యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ నినాదాలతో ముందుకు సాగారు. కార్యక్రమంలో లౌక్య తండా సర్పంచ్ రాజేందర్ నాయక్, ఎమ్మెల్యే హెచ్‌పి అన్వేష్, దాసు నాయక్, ఆశ జ్యోతి, ఎమ్మార్పీఎస్ కొమిరి ఉపేందర్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System