Type Here to Get Search Results !

జ్ఞాన సూర్యుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అవార్డును అందుకున్న చెలిమల్ల గణేష్.

NAMASTHE NEWS 0

జ్ఞాన సూర్యుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అవార్డును అందుకున్న చెలిమల్ల గణేష్.


నర్సింహులపేట,ఏప్రిల్ 30(నమస్తే న్యూస్)

నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ మంగళపల్లి హుస్సేన్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మానవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల్లో సామాజిక సేవలు, సామాజిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి వారికి "జ్ఞాన సూర్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అవార్డు"ను అందజేసి అత్యున్నత ప్రతిభ పురస్కారంతో సత్కరించారు.ఇందులో భాగంగా నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన చెలిమల్ల గణేష్ గత కొన్ని సంవత్సరాలుగా మండలంలో వివిధ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై, ప్రతిక్షణం ప్రజా సంక్షేమం కోసం కృషి చేసినందుకు ఆయనను "జ్ఞాన సూర్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అవార్డు"తో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న సామాజిక కార్యకర్తలను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని,డా. బి.ఆర్.అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వం,న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాస రావు,డి ఎస్ ఎఫ్ ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్, ఎక్సైజ్ అడిషనల్ ఎస్పి రవి కిరణ్,  ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు  గుగ్గిళ్ళ పిరయ్య, పొన్నాల యోగేందర్, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర బీమా నాయక్, బి సి సంఘం ప్రెసిడెంట్ వేముల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System