Type Here to Get Search Results !

నల్లబెల్లాన్ని తరలిస్తున్న లారీ పట్టివేత.

NAMASTHE NEWS 0

•నల్లబెల్లాన్ని తరలిస్తున్న లారీ పట్టివేత.


•కురవి పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ అధికారుల సంయుక్త దాడులు.


•రూ.8 లక్షల విలువైన 70 క్వింటాళ్ల నల్లబెల్లం, 10 క్వింటాళ్ల పటిక గుర్తింపు.


•ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన కురవి పోలీసులు.




స్టాఫ్ రిపోర్టర్:పడిదం నరేందర్.

(నమస్తే న్యూస్, మహబూబాబాద్, మార్చి 19)

అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తూ పోలీసుల నుండి తప్పించుకోలేరని, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ గండ్రాతి  సతీష్ హెచ్చరించారు.ఈ సందర్భంగా అక్రమ సారాయి తయారీకి వినియోగించే నల్లబెల్లం రవాణాపై పోలీసులు గట్టి దెబ్బ కొట్టారు.  ఎస్సై  సతీష్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ మరియు కురవి పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో భారీగా నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే… చిత్తూరు నుంచి మహబూబాబాద్‌కు అక్రమంగా నల్లబెల్లం తరలిస్తున్నట్లు వచ్చిన గోప్య సమాచారంతో పోలీసులు కురవి శివారు సోమ్లా తండా సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న లారీని ఆపి తనిఖీ చేయగా, అందులో సుమారు రూ.8 లక్షల విలువైన 70 క్వింటాళ్ల నల్లబెల్లం, 10 క్వింటాళ్ల పట్టికను గుర్తించారు.

తక్షణమే సరుకును స్వాధీనం చేసుకుని, లారీని సీజ్ చేశారు. ఈ కేసులో గుగులోత్ సుమన్ (మహబూబాబాద్), ఆరెపల్లి మధు, బొల్లా విజయ్ కుమార్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో టాస్క్ ఫోర్స్ సీఐ హతీరామ్, ఎస్సై తాహేర్ బాబా, కురవి ఎస్సై గండ్రాతి సతీష్, ఎస్సై జయకుమార్‌తో పాటు పోలీస్ సిబ్బంది సమ్మయ్య, హరిబాబు, నరేష్, బద్రు, బాబు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System