Type Here to Get Search Results !

రాష్ట్ర బడ్జెట్ లో దళితులకు భారీ ద్రోహం. కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి-టి స్కైలాబ్ బాబు

NAMASTHE NEWS 0

•ఏప్రిల్  నెలను మహానీయుల మాసంగా పాటించాలి.


•పూలే అంబేద్కర్ స్ఫూర్తితో కులరహిత  సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలి.


•గరికపాటి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి.


•రాష్ట్ర బడ్జెట్ లో దళితులకు భారీ ద్రోహం.


-కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి-టి స్కైలాబ్ బాబు




(నమస్తే న్యూస్, మహబూబాబాద్,మార్చి 24)

ఏప్రిల్ నెలను మహనీయుల మాసంగా పాటిస్తూ కులరహిత సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం పెరుమాండ్ల జగన్నాధం భవన్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ జ్యోతిబా పూలే (ఏప్రిల్ 11), అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) సందర్భాలను పురస్కరించుకొని నెల పొడవునా సమానత్వ భావన పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలో కుల వివక్ష, అంటరానితనం ఇంకా కొనసాగుతుండటం బాధాకరమని, వీడీసీల పేరుతో అట్టడుగు వర్గాలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సామాజిక సంక్షేమ హాస్టళ్లలో గ్యాస్ కొరత వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర బడ్జెట్‌లో దళితులకు కేటాయింపులు భారీగా తగ్గించారని, గత బడ్జెట్‌తో పోలిస్తే నిధులు 70% వరకు కోత పెట్టారని విమర్శించారు. మొత్తం కేటాయింపులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుడ్డేల రామ్మూర్తి  ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గుగ్గిళ్ళ పిరయ్య అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కార్యదర్శి నీరుడు సామేలు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి ప్రభాకర్ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఏర్పుల వీరస్వామి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి హరి నాయక్ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి యమగాని వెంకన్న సీఐటీయూ నాయకులు వెంకన్న ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి నక్క సైదులు కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు చింత ఎల్లయ్య మందుల మహేందర్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకూబ్ శేషం ప్రశాంత్ జిల్లా నాయకులు ప్రియాంక అరుణ లలిత మచ్చ వెంకన్న యుగంధర్ శ్రీనివాస్ బాణాల రాజయ్య గునిగంటి మోహన్ హేమ నాయక్ చేపూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System