Type Here to Get Search Results !

రైతు నేస్తం - 2025 పురస్కారం అందుకున్న జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న

NAMASTHE NEWS 0


 

రైతు నేస్తం - 2025 పురస్కారం అందుకున్న 
జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి
 జినుగు మరియన్న



(నమస్తే న్యూస్, మహబూబాబాద్, అక్టోబర్.26)
ఆదివారం స్వర్ణ భారతి ట్రస్ట్, ముచ్చింతల్, శంషాబాద్, హైదరాబాద్ నందు రైతు నేస్తం అవార్డ్ కార్యక్రమం లో  భారత పూర్వ ఉప రాష్ట్రపతి  గౌరవ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ , ఉద్యాన, అనుబంధల శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు ఎడిటర్ రైతు నేస్తం  గౌరవ శ్రీ యండపల్లి వెంకటేశ్వరావు (పద్మశ్రీ అవార్డ్ గ్రహీత) గార్ల చేతుల మీదుగా అధికారి అందించిన సేవలకు గాను జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమ అధికారి, జినుగు మరియన్న  మహబూబాబాద్  రైతు నేస్తం – 2025 పురస్కారాన్నీ అందుకన్నారు. 
రైతులకు సేవ, నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ పంట మార్పిడి ద్వారా ఉద్యాన పంటల విస్తరణ, రైతులు పలు మేలైన యాజమాన్య పద్దతులు, సాంకేతిక పరిజ్ఞానం, రైతుల విజయ గాధలు మొదలైన విషయాలను తెలియజేస్తూ ఆయిల్ పామ్, పండ్లు, కూరగాయలు, పూలు, మల్బరీ, మునగ మొదలైన పంటల విస్తరణకు రైతులకు అవగాహన చేస్తూ, 30 (ముప్పై) వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ తోటల విస్తరణ చేసినందుకు మరియు ఉద్యాన పంటలు కూడా 10 (పది) వేల ఎకరాల విస్తరణ చేసినందుకు వారి సేవలను గుర్తిస్తూ విస్తరణ విభాగంలో రైతు నేస్తం – 2025 పురస్కారాన్నీ అందుకున్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System