Type Here to Get Search Results !

జనవికాస సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

NAMASTHE NEWS 0

 నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట 



వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు కోట నరేష్, ఎం డి డైరెక్టర్ ఎన్ రాము, కిరణ్ , సందీప్, రాధాకృష్ణ, దేవి నికిత సెంటర్ మేనేజర్ సుకన్య గ్రామస్తులకు సూచించారు. 
నర్సింహులపెట మండలంలోని పడమటి గూడెం గ్రామంలో మెడికేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులతో కలిసి జనవికాస ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 
   మెడికేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు 180 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. 
     మెడికేర్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్లు సెంటర్ మేనేజర్ సుకన్య మాట్లాడుతూ వాన కాలంలో వ్యాపించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ,వానాకాలంలో డెంగ్యూ మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ప్రజలు తమ పరిసర ప్రాంతాలలో నీటి విలువ ఉండకుండా చూసుకోవాలని ,అనునిత్యం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు .ముఖ్యంగా వర్షాకాలంలో పిల్లలకు వృద్ధులకు ఎక్కువగా అంటువ్యాధులు సోకే అవకాశాలు మెండుగా ఉంటాయని ఒకరి నుండి మరొకరికి వ్యాధులు సోకకుండా ఉండేందుకు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటిస్తు ఏమైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని వారు సూచించారు .ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో వర్షపునీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని నీరు నిల్వ ఉన్నట్లయితే వాటిల్లో దోమలు అధిక మొత్తంలో గుడ్లు పెట్టి వాటి సంతాన ఉత్పత్తిని పెంచుకొని వ్యాధులకు కారకాలుగా మారే ప్రమాదం ఉందని అలా జరగకుండా ఎప్పటికప్పుడు తమ ప్రాంతాలలో పారిశుద్ధ్యం కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ప్రజలు ప్రాణాలను రక్షించుకోవాలని సూచించారు .
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ఉపెందర్ విలేజ్ లీడర్స్ చందుభీ, నాగలక్ష్మి, వెంకన్న, దేవేందర్, కోఆర్డినేటర్లు స్వర్ణలత, స్వరూప రాణి, లీడర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System