Type Here to Get Search Results !

మీడియా పై దాడి చేయడం...ప్రజాస్వామ్యం పై దాడే..!

NAMASTHE NEWS 0

స్వతంత్ర భారతదేశం ఆమోదించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలోని నాలుగు ప్రధాన స్తంభాలలో జర్నలిజం చాలా ముఖ్యమైన స్తంభం. భారత రాజ్యాంగం నందు ప్రాథమిక హక్కులో పత్రికా స్వేచ్ఛను భావప్రకటనా స్వేచ్ఛగా చేర్చారు. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా అధికార పార్టీలు పత్రికా స్వేచ్ఛను అణిచివేస్తున్న ఘటనలు ఉన్నాయి. ఒకటి, మహిళలపై అమానవీయ వేధింపుల సంఘటనలపై నివేదించడానికి వెళ్లిన "ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా" ప్రతినిధులపై మణిపూర్ ప్రభుత్వం క్రిమినల్ అభియోగాలు నమోదు చేసినది తెల్సిందే. రెండవది, ముంబైలోని అధికార బీజేపీ నేత కిరీట్ సోమయ్యకు సంబంధించిన అభ్యంతరకర వీడియో టేప్‌ను ప్రసారం చేసినందుకు "డెమోక్రటిక్ న్యూస్ ఛానెల్" ఎడిటర్ కమలేష్‌ సుతార్ పై పోలీసు కేసు నమోదు చేశారు. ఐతే ఈ 2ఘటనలు మీడియా స్వేచ్ఛపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా గుర్తిస్తున్నామని సెక్యులర్ మూవ్‌మెంట్ (ఎస్.ఎం) మహారాష్ట్ర అధ్యక్షుడు భారత్ షెల్కే ఆరోపించారు. సోమవారం ముంబై ఆజాద్ మైదానలో సెక్యూలర్ మూవ్మెంట్, సెక్యూలర్ ఆర్ట్ మూవ్మెంట్ సంయుక్తంగా విలేకరులపై దాడులకు నిరసన కార్యక్రమం జర్పారు. మణిపూర్ ముంబైలో జర్నలిస్టులపై నమోదు చేసిన నేరాలను రద్దు చేయాలని వక్తలు కోరారు. అలాగే అరెస్ట్ చేసిన విలేకరులకు న్యాయం జరిగేలా రాష్ట్ర గవర్నర్‌కు వినతి పత్రం ఇవ్వనున్నామని తెల్పారు. ప్రదర్శనలో ఎస్.ఎం ముంబై అధ్యక్షుడు ప్రకాష్ హివాలే, ఆర్గనైజర్ గౌతమ్ సాంగ్లే, కార్యదర్శి వినోద్ షిండే, సెక్యూలర్ ఆర్ట్ మూవ్మెంట్ కళాకారులు ఫాసిస్టు రాజ్యం నొక్కుతున్న మీడియా గొంతును వ్యతిరేకిస్తూ తమ ఆర్ట్ చే బ్యానర్లపై బొమ్మలు గిసి తీవ్ర ఆక్రోశం ప్రదర్శించారు.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System